Share News

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:23 AM

కేంద్రం మాదిగల ఊపిరి అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర మాదిగ సోమవారం ఒక ప్రకటనలో

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

మాదిగ హక్కుల దండోరా

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : కేంద్రం మాదిగల ఊపిరి అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర మాదిగ సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గతంలో ఉషా మెహ్రా కమిషన్‌, రామచంద్ర కమిషన్‌ ఎస్సీ వర్గీకరణ కోసం ఇచ్చిన నివేదికలను అప్పటి యూపీఏ ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ నివేదిక ఆధారంగానే ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. సరిగ్గా ఎన్నికలకు 70 రోజుల ముందు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

Updated Date - Jan 30 , 2024 | 03:23 AM