ఎస్‌బీఐ చర్య సుప్రీం ధిక్కరణే: నారాయణ
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:11 AM
సుప్రీం కోర్టు ఆదేశాల్ని ఎస్‌బీఐ ధిక్కరిస్తోందని, మార్చి 15వ తేదీలోపు ఎలక్టొరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తే..

సుప్రీం కోర్టు ఆదేశాల్ని ఎస్‌బీఐ ధిక్కరిస్తోందని, మార్చి 15వ తేదీలోపు ఎలక్టొరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తే.. జూన్ వరకు గడువు ఇవ్వాలని ఇప్పుడు కోరడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ప్రశ్నించారు. సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు ఒక్కబటన్ నొక్కితే మొత్తం వివరాలు బయటపడతాయన్నారు. జూన్ వరకు టైం కావాలని అడగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎస్‌బీఐ ఉద్ధేశపూర్వకంగానే దొంగ రాజకీయ నాయకులను, దొంగల డబ్బును కాపాడటానికే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టు ధిక్కరణ కింద పరిగణించి ఎస్‌బీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.