Share News

ఘనంగా సంకటహర చతుర్థి పూజలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:31 AM

ధర్మపురి రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గల గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా సంకటహర చతుర్థి పూజలు
స్వామి వారలకు హారతి పూజలు నిర్వహస్తున్న దృశ్యం

ధర్మపురి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఽధర్మపురి రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గల గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. ఆలయ వేదపండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ, స్థానిక వేదపండితులు మదు రామశర్మ, అర్చకులు ద్యావళ్ల విశ్వనాథ్‌శర్మ తదితర వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా ఉపనిషత్‌లతో అభిషేకం, విశేష పూజలు, నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, అభిషేక్‌ పౌరో హితులు బొజ్జ సంతోష్‌కుమార్‌, సంపత్‌కుమార్‌, అర్చకులు సాయికుమార్‌, ఆర్యవైశ్య సత్రం కోశాధికారి జక్కు దేవేందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:32 AM