Share News

Manchiryāla- పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:42 PM

పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. దండేపల్లి మండలంలోని దండేపల్లి, లింగాపూర్‌ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభభుత్వ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

Manchiryāla-       పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి
వృద్ధురాలితో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి, ఆగస్టు 21: పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. దండేపల్లి మండలంలోని దండేపల్లి, లింగాపూర్‌ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభభుత్వ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు సరైన వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లింగాపూర్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు గణితం, ఇంగ్లిషు సబ్జెక్టులను బోధించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్‌ వాడీ కేంద్రంలో గర్భిణులు, పిల్లలకు సమయానుకూలంగా పోషకాహారం అందించాలన్నారు. రైతు వేదికను సందర్శించి రైతు రుణమాఫీ ప్రక్రియ, రెతుల సమస్యల పరిష్కరంపై వ్యవసాయ అధికారులు తీసుకుంటున్న చర్యలపై వ్యవసాయ అధికారులు, రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనం పనులను చూశారు. పల్లె దవాఖానను సందర్శించి సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయా విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను సందర్శించి రైతు రుణమాఫీ అమలు తీరును పరిశీలించారు.

Updated Date - Aug 21 , 2024 | 10:42 PM