Share News

పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:26 AM

గ్రామాలను పరిశుభ్రం చేసే పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
పోస్టర్‌ అవిష్కరిస్తున్న టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

మోటకొండూరు, జనవరి 11: గ్రామాలను పరిశుభ్రం చేసే పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్‌ నిర్వహించే పోరుగర్జన కరపత్రాన్ని యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలకేంద్రంలో పారిశుధ్య కార్మికులతో కలిసి గురువారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు సంవత్సరాలుగా గ్రామాల్లోని రోడ్లను ఊడ్చి, వ్యర్థాలను ఎత్తిపోసి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారన్నారు. అన్ని ఉద్యోగాలకు ఇతర కులాల వారు పోటీ పడతారు కానీ, గ్రామాలను శుభ్రం చేసే వద్ద దళితులు మాత్రమే ఉంటారని తెలిపారు. కారోనా కష్టకాలంలో తమ ప్రాణలు సైతం లెక్కచేయకుండా డాక్టర్లు, వైద్యసిబ్బందితో సమానంగా పారిశుధ్య కార్మికులు సేవాలు అందించాని గుర్తుచేశారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్‌లో నిర్వహించే పోరుగర్జన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొల్లూరి మొగులయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది చంద్రమ్మ, ఎల్లమ్మ, యాదమ్మ, అరుణ, లలిత, వీరమ్మ, ఉపేంద్ర, బుగ్గ శ్రీశైలం, బోగారం వీరస్వామి, వంగపల్లి దయాకర్‌, బోగారం భిక్షపతి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:26 AM