Share News

కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీ మంజూరు

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:34 AM

వైద్యవిద్యకు సంబంధించి నాలుగు కళాశాలలు కొడంగల్‌కు మంజూరు అయ్యాయి. మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీల ప్రారంభానికి అవసరమైన పాలనపరమైన అనుమతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు

కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీ మంజూరు

నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కళాశాలలు కూడా

220 పడకల ఆస్పత్రిగా సీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌

224.50 కోట్లకు అనుమతులు

జీవో జారీ చేసిన సర్కారు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యకు సంబంధించి నాలుగు కళాశాలలు కొడంగల్‌కు మంజూరు అయ్యాయి. మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీల ప్రారంభానికి అవసరమైన పాలనపరమైన అనుమతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు శనివారం ఉత్తర్వ్యులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ఈ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే 60 సీట్లతో నర్సింగ్‌, 50 సీట్లతో ఫిజియోథెరపీ, 30 సీట్లతో పారామెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ జీవోలో వెల్లడించారు. కాగా, ఈ కళాశాలల భవననిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాలశాఖకు అప్పగిస్తున్నటు ఆ జీవోలో పేర్కొన్నారు. అలాగే అందుకు అవసరమైన నిధులను కేటాయించినట్లు తెలిపారు. వైద్యవిద్య కళాశాలకు రూ.124.50 కోట్లు, నర్సింగ్‌ కాలేజీకి రూ.46 కోట్లు, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కళాశాల భవనాలకు రూ.27 కోట్లు కేటాయించింది. ఇక కొడంగల్‌లోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్‌సీ) మెడికల్‌ కాలేజీల కోసం 220 బెడ్ల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సర్కారు ఆ జీవోలో పేర్కొంది. అందుకు రూ.27 కోట్లను మంజూరు చేసింది. ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)కు అప్పగించింది. అలాగే ఇప్పటివరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిఽధిలో ఉన్న ఈ సీహెచ్‌సీని, వైద్యవిద్య సంచాలకుల పరిధికి తక్షణమే బదిలీ చేస్తున్నట్లు సర్కారు ఆ జీవోలో పేర్కొంది. అంతేకాకుండా కళాశాలల ఏర్పాటుకు అవసరమైన అత్యవసర ధృవపత్రాలు, నిరభ్యంతర పత్రాలను(ఎన్‌వోసీ) కూడా తక్షణమే ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు అదే ఉత్తర్వ్యుల్లో వెల్లడించింది.

Updated Date - Feb 12 , 2024 | 02:34 AM