కార్గిల్ యుద్ధ వీరులకు సెల్యూట్
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:14 PM
కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమని, వీరులకు సెల్యూట్ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

- 25వ కార్గిల్ విజయ్ దివస్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 28 : కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమని, వీరులకు సెల్యూట్ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి, అందులో మన ఆర్మీ విజయం సాధించి 25వ సంవత్సరాలు అవుతున్నం దున విజయ్‌దివాస్ పేరిట వేడుకలు ఆదివారం జిల్లా ఉమ్మడి మాజీ సైనికులు పసుల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సైనికులు ఆనాటి స్మృతులు నెమరు వేసుకున్నారు. ముఖ్యఅతిధిగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సైనికులు కార్గిల్ విజయ్‌దివస్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందరు మాజీ సైనికులను కలుసుకు న్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ మహమూద్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంఘం ప్రెసి డెంట్ వి. వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్, గౌరవ అధ్యక్షుడు ఎంఆర్‌కె.రెడ్డి, అడ్వయిజర్ కె. వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు ఎన్. రాము లు, కోశాధికారి రాజవర్థన్‌రెడి,్డ నిరంజన్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గిరిధర్‌రెడ్డి, గణేష్, జమీల్, మాజీ సైనికులు వారి కుటుంబాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సమస్య లపైన ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు.
నాటిన ప్రతీ మొక్క బతకాలి : ఎమ్మెల్యే
మహబూబూబ్‌నగర్, జూలై 28 : నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాల న్నారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షనే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు అంకితభావంతో పని చేయాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని స్టేట్‌హోమ్‌లో మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 35 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్టేట్‌హోమ్ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో సత్యనారాయణ నాయకులు షబ్బీర్‌అలీ, తిరుమల వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.