Share News

అండర్‌-14 రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెనగా సాయిఅభిజ్ఞ

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:37 AM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన జాతీయస్థాయి అండర్‌ - 14 తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెనగా మండల కేంద్రానికి చెందిన వల్లవాయి సాయిఅభిజ్ఞ ఎంపికైంది.

 అండర్‌-14 రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెనగా సాయిఅభిజ్ఞ
అభిజ్ఞ

అండర్‌-14 రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెనగా సాయిఅభిజ్ఞ

తిరుమలగిరి(సాగర్‌), జనవరి 28: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన జాతీయస్థాయి అండర్‌ - 14 తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెనగా మండల కేంద్రానికి చెందిన వల్లవాయి సాయిఅభిజ్ఞ ఎంపికైంది. నల్లగొండ జిల్లా కేం ద్రంలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సాయిఅభిజ్ఞ కొన్నేళ్లుగా కబడ్డీలో విశేషంగా రాణిస్తుంది. దీంతో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన, తెలంగాణ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఈ నెల ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లా రాజవరంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు కెప్టెనగా ఆమెను నియమించింది. 2022 నవంబరులో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసానిలో నిర్వహించిన 6వ ఇంటర్‌ సొసైటీ స్పోర్ట్స్‌ లీగ్‌లో బాలికల విభాగంలో జిల్లా జట్టు ప్రథమస్థానం పొందడంలో ఆమె ఎంతో ప్రతిభ కనబరిచారు. అదేవిధంగా 2022 డిసెంబరులో మంచిర్యాల జిల్లా కేంద్రంలో 32వ సబ్‌ జూనియర్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో పొందడంలో ఆమె తన ప్రతిభను చాటింది. 2023 డిసెంబరులో నిజామాబాద్‌ జిల్లా ముస్తాపూర్‌లో నిర్వహించిన 70వ సీనియర్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు ప్రథమ స్థానం పొందింది. ఈ పోటీల్లో సాయిఅభిజ్ఞ జిల్లా జట్టు తరుపున పాల్గొని తన ప్రతిభను చాటారు. అదేవిధంగా 2024 జనవరిలో జనగామ జిల్లా ధర్మకంచెలో నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టు తరుపున ఆమె పాల్గొని రాణించింది. 2024 జనవరిలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన 49వ జూనియర్‌ ఇంట ర్‌ డిస్ర్టిక్ట్‌ ఛాంపియనషి్‌ప పోటీలో ఆమె జిల్లా జట్టు తరుపున పాల్గొన్నది. దీంతో ఈ క్రమంగా రాణిస్తూ జిల్లా జట్టును గెలిపించడంలో కృషి చేస్తున్న సాయిఅభిజ్ఞ తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెనగా అధికారులు ఎంపికైనట్లు కోచలు కాశీ, ఉపేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు, ప్రజాప్రతినిఽధులు సాయిఅభిజ్ఞను అభినందించారు.

Updated Date - Jan 29 , 2024 | 12:37 AM