Share News

ఎలనాగకు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:20 AM

ప్రముఖ అనువాదకుడు ఎలనాగ(డా. సురేంద్ర నాగరాజు)కు 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పవన్‌ కె వర్మ గాలిబ్‌ ద మాన్‌, ద

ఎలనాగకు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ అనువాదకుడు ఎలనాగ(డా. సురేంద్ర నాగరాజు)కు 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పవన్‌ కె వర్మ గాలిబ్‌ ద మాన్‌, ద టైమ్స్‌్‌ పేరుతో రచించిన ఆంగ్ల పుస్తకాన్ని గాలిబ్‌ నాటి కాలం పేరుతో అనువదించినందుకు న్యాయనిర్ణేతల బృందం ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన పిల్లల వైద్యుడు అయిన డా. సురేంద్ర ఎన్నో గ్రంథాలను తెలుగు నుంచి ఇంగ్లీషుకు, ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువదించారు. వచనంలో, పద్యంలో పలు కవితా సంపుటులు వెలువరించారు. భాషా గ్రంథాలు కూడా రచించారు.

Updated Date - Mar 12 , 2024 | 11:21 AM