Share News

జనవరి నెల సదరం క్యాంపు ఆన్‌లైన్‌ స్లాట్స్‌ విడుదల

ABN , Publish Date - Jan 02 , 2024 | 11:09 PM

జనవరి నెలకు సంబంధించి సదరం క్యాంపు ఆన్‌లైన్‌ స్లాట్స్‌ను జిల్లా కలెక్టర్‌ విడుదల చేసినట్టు జిల్లా పూర్తి స్థాయి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు తెలిపారు.

జనవరి నెల సదరం క్యాంపు ఆన్‌లైన్‌ స్లాట్స్‌ విడుదల

5, 19 తేదీల్లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో..

9, 23, 30 తేదీల్లో కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రిలో సదరం క్యాంపు

క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగులు మీసేవలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి

దరఖాస్తుదారులు డాక్టర్‌ రిపోర్టు, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, ఫోటో తీసుకుని రావాలి

జిల్లా పూర్తిస్థాయి ఇంచార్జ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 2 : జనవరి నెలకు సంబంధించి సదరం క్యాంపు ఆన్‌లైన్‌ స్లాట్స్‌ను జిల్లా కలెక్టర్‌ విడుదల చేసినట్టు జిల్లా పూర్తి స్థాయి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు తెలిపారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్‌ను ఆదేశించారు. సదరం క్యాంపునకు హాజరు కావాలనకునే వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9, 23, 30 తేదీల్లో కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ నెల 5,19 తేదీల్లో రెండు రోజుల పాటు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సదరం క్యాంపు ఉంటుందని ఆయన తెలిపారు. క్యాంపునకు వచ్చే దివ్యాంగులు తప్పనిసరిగా మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకుని, రశీదులో సూచించిన సమయానికి ఆసుపత్రికి చేరుకోవాలన్నారు. దరఖాస్తుదారులు డాక్టర్‌ రిపోర్టుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఫఞటో తీసుకుని రావాలని చెప్పారు. మీసేశ స్లాట్‌ బుకింగ్‌లో డీఆర్‌డీఏ ప్రమేయం ఉండదని, స్లాట్స్‌ దొరకని దరఖాస్తుదారులకు వచ్చేవచ్చే నెల మొదటి వారంలో స్లాట్స్‌ మీ సేవలో అందుబాటులో ఉంటాయని జిల్లా పూర్తిస్థాయి ఇంచార్జ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు చెప్పారు.

Updated Date - Jan 02 , 2024 | 11:09 PM