రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేయాలి
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:22 PM
వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడులకు గాను రైతుభరోసా పథకం ద్వారా రైతుఖాతాల్లోకి ఎకరాకు రూ.7500 జమ చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేయాలి
దేవరకొండ, జూన 10: వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడులకు గాను రైతుభరోసా పథకం ద్వారా రైతుఖాతాల్లోకి ఎకరాకు రూ.7500 జమ చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. దేవరకొండలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం వచ్చినా రైతులకు పంట పెట్టుబడి సాయం గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తోందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నా రు. రైతు భరోసా ద్వారా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.