Share News

ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుంది

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:01 PM

ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి అన్ని రకాలుగా న్యా యం జరుగుతుందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుంది
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

- మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంతో

ఆర్టీసీపై గౌరవం పెరిగింది

- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 8: ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి అన్ని రకాలుగా న్యా యం జరుగుతుందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సామాన్యుడి నుం చి ముఖ్యమంత్రిగా ఎదిగిన జిల్లా బిడ్డ రేవంత్‌ రె డ్డికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. సోమవారం జిల్లాకేంద్రంలోని రైస్‌మిల్లు అసోసియేషన్‌ భవనంలో ఆర్టీసీ సంఘాలు టీఎస్‌ ఆర్టీసీ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూసీ సంఘాలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం వల్ల ఆర్టీసీ గౌరవం, ప్రతిష్టను పెంచాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నా వాటిని ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో ప్రజలను ఒప్పించి మెప్పించిన నాయకుడు రేవంత్‌రెడ్డి అని కొనియా డారు. వీలైనంత త్వరగా ఆర్టీసీ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రికి విన్నవిస్తానని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రజల ఆస్తిని ఆ ఆస్తి ఇంచు కబ్జాకు గురైన తాను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు వారి అవసరా ల కోసం దాచుకున్న సొమ్మును కూడా బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం కాజేసిందని ఆరోపించారు. ఈ ప్రజా ప్ర భుత్వంలో మీ అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్య క్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌, నాయకులు హర్షవర్ధన్‌ రెడ్డి, ఎం సురేందర్‌రెడ్డి, టి రాజేందర్‌రెడ్డి, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, అమరేందర్‌రాజు, అహ్మద్‌, ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రెటరీ డి గోపాల్‌, సహా యకార్యదర్శి సాయిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజర్‌ విజయ్‌ బాబు, జిల్లా బాధ్యులు రాములుయాదవ్‌, శ్రీను, సాయిబాబ, బెనహర్‌ పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు ఆగవు

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : కాంగ్రెస్‌ వస్తే సం క్షేమ పథకాలు ఆగిపోతాయని, కల్యాణలక్ష్మి చెక్కు లు రావని, పింఛన్లు ఆగిపోతాయని బీఆర్‌ఎస్‌ ప్ర చారం చేసిందని, అవేమీ ఆగలేదని, చెక్కులు వస్తు న్నాయని, పింఛన్‌ ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాం ప్‌ కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపి ణీ చేశారు. కార్యక్రమంలో రూరల్‌ తహసీ ల్దార్‌ సుందర్‌రాజు, నయాబ్‌ తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రి, మల్లు నర్సింహారెడ్డి, నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సాయిబాబ, నాగమణి, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, గోవింద్‌యాదవ్‌, మాధవ రెడ్డి, రాంచంద్రయ్య, రాజుగౌడ్‌, మోహన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

104 ఏళ్ల చరిత్ర కలిగినది ఏఐటీయూసీ

పాలమూరు : ప్రతీ నిత్యం కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న ఏఐటీయూసీకి 104ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అ న్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఏఐటీయూసీ క్యాలెండర్‌, డైరీని ఆవిష్క రించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శి మాకం రాంమోహన్‌, నాయకులు సత్య నారా యణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, టి.నరసింహ, లక్ష్మ య్య, ప్రకాష్‌, వీ రేంద్రకుమార్‌, కృష్ణయ్య, బి.ఆర్‌ విల్సన్‌, మంజుల, అలివేలు, పార్వతమ్మ, చిన్న మ్మ, శివనాయక్‌, ఆనందు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో రాణించాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : పాలమూరు క్రీడాకారులు జాతీయస్థాయి రాణించాలని ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం కాలనీ సమీపం లో గల మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో నూతనంగా నిర్మించిన గదులను ఎ మ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, దేవరాజ్‌, మహబూబ్‌ నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.సురేష్‌, కార్యదర్శి రాజశేఖర్‌, సిరాజ్‌ఖాద్రి, మనోహర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:01 PM