Share News

ఆర్టీసీ సీసీఎస్‌కు రూ.150 కోట్లు విడుదల

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:50 AM

సుదీర్ఘ పోరాటం తర్వాత టీఎ్‌సఆర్టీసీ సీసీఎ్‌స(ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం)కు బకాయి పడిన నిధుల్లో రూ.150 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఆర్టీసీ యాజమాన్యం పూచీకత్తుపై మరో రూ.150 కోట్లు జాతీయ బ్యాంకులు రుణంగా సమకూర్చడానికి

ఆర్టీసీ సీసీఎస్‌కు రూ.150 కోట్లు విడుదల

బ్యాంకుల నుంచి మరో 150 కోట్ల రుణం..!

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం..!?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ పోరాటం తర్వాత టీఎ్‌సఆర్టీసీ సీసీఎ్‌స(ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం)కు బకాయి పడిన నిధుల్లో రూ.150 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఆర్టీసీ యాజమాన్యం పూచీకత్తుపై మరో రూ.150 కోట్లు జాతీయ బ్యాంకులు రుణంగా సమకూర్చడానికి అంగీకరించడంతో మూడేళ్లుగా రుణాలు, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసిన సుమారు పదివేల మంది ఆర్టీసీ కార్మికులకు ఊరట లభించనున్నది. కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన 7 శాతం నిధులను ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌ ఖాతాలో జమ చేస్తోంది. ఆ సొమ్ముకు వడ్డీ లెక్కగట్టి అవసరమైన సందర్భంలో రుణంగా అందజేస్తుంది. ప్రతి నెల సుమారు రూ.12 కోట్లకు పైగా నిధులు సీసీఎస్‌ ఖాతాలో జమ కావాల్సి ఉంది. అంతేకాకుండా రిటైర్డ్‌ ఉద్యోగుల వద్ద నుంచి సొమ్మును డిపాజిట్‌ల రూపంలో స్వీకరించి నెల నెలా వడ్డీ రూపంలో సీసీఎస్‌ అందిస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని యాజమాన్యం కొన్నేళ్లుగా వేతనాల నుంచి మినహాయించిన నిధులను సీసీఎస్‌ ఖాతాలో జమ చేయకపోవడంతో ఇప్పటి వరకు సుమారు 1300 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సీసీఎస్‌ నుంచి రుణాలు, అడ్వాన్సుల కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లుగా కార్మికులు నిరీక్షిస్తున్నారు. పలు పర్యాయాలు యాజమాన్యానికి విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సీసీఎస్‌ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. తక్షణ సాయంగా సీసీఎ్‌సకు కనీసం రూ.200 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిధులు అందుబాటులో లేవని ఆర్టీసీ యాజమాన్యం నిస్సహాయత వ్యక్తం చేస్తూ కేవలం రూ.50కోట్లు విడుదల చేసింది. రిటైర్‌ అయిన కార్మికులకు, సభ్యత్వానికి రాజీనామా చేసిన కార్మికులకు ఖాతాలను సెటిల్‌ చేయడానికి రూ.300 కోట్లు విడుదల చేయాలని సీసీఎస్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం తాజాగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను మహాలక్ష్మి పఽథకం రీ-ఇంబర్స్‌మెంట్‌గా పరిగణించాలని నిర్ణయించినట్టు తెలిసింది. బ్యాంకుల నుంచి మరో రూ.150 కోట్లు రుణంగా తీసుకునేందుకు గ్యారంటీ ఇవ్వడంతో... ీదరఖాస్తు చేసిన వారందరికీ ఆర్థిక సాయం అందుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరువేల మంది సీసీఎస్‌ నుంచి ఆర్ధిక సాయం కోసం దరఖాస్తు చేసి మూడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. దాదాపు నాలుగువేల మంది కార్మికులు ఖాతాలను సెటిల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో రెండు వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగుల, ఇంకో వేయి మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల దరఖాస్తులు సీసీఎ్‌సలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Apr 25 , 2024 | 08:23 AM