Share News

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:05 AM

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ బుద్ధవనం సమీపంలో కారును రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
బస్సులు ఢీకొనడంతో ధ్వంసమైన కారు

నుజ్జు నుజ్జయిన కారు.. తప్పిన పెను ప్రమాదం

నాగార్జునసాగర్‌, జనవరి 17: నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ బుద్ధవనం సమీపంలో కారును రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సాగర్‌ ఎస్‌ఐ సంపత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ అరుణ్‌ కుమార్‌ పొట్టిచెల్మకు విధులు నిర్వర్తించేందుకు కారులో వెళుతుండగా, హిల్‌కాలనీ బుద్ధవనం సమీపంలో రెండో ఘాట్‌ వద్ద నల్లగొండ డిపోకు చెందిన బస్సు నల్లగొండ నుంచి మాచర్లకు వస్తూ అదుపు తప్పి కారును డీకొట్టింది. అదే సమయంలో మాచర్ల నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళుతుంది. ఈ క్రమంలో సాగర్‌ నుంచి పొట్టిచెల్మకు వెళుతున్న అసిస్టెంట్‌ కమాండెంట్‌ కారును రెండు బస్సులు ఒకేసారి వెనక, ముందు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టంజరగలేదు. పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 12:05 AM