Share News

రిజర్వేషన్లను ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:52 AM

రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆరెస్సెస్‌ ఇప్పుడు చెబుతున్నా.. గతంలో ఆ సంస్థ వాటిని వ్యతిరేకించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

రిజర్వేషన్లను ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలన్నది బీజేపీ, ఆరెస్సెస్‌ల విధానం

తెలంగాణలో బీజేపీతో చేతులుకలిపిన బీఆర్‌ఎస్‌ను గద్దె దించాం: రాహుల్‌ గాంధీ

డామన్‌, కటక్‌, ఏప్రిల్‌ 28: రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆరెస్సెస్‌ ఇప్పుడు చెబుతున్నా.. గతంలో ఆ సంస్థ వాటిని వ్యతిరేకించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కాంగ్రె్‌సకు, ఆరెస్సె్‌స-బీజేపీకి మధ్య ఉన్న పోరాటం సైద్ధాంతికమైనదని.. వాళ్లు దేశ రాజ్యాంగాన్ని నిర్మూలించాలనుకుంటే తాము కాపాడాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘భారతదేశానికి రాజ్యాంగం పునాదిలా నిలిచింది. ఆరెస్సె్‌స-బీజేపీ వాళ్లు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయాలని కోరుకుంటున్నారు. దేశాన్ని రాజుల్లాగా ఏలుదామనుకుంటున్నారు’ అని విమర్శించారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కామని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చెప్పిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలితప్రాంతం డయ్యూడామన్‌లోని డామన్‌లో, ఒడిసాలోని కటక్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్‌ ప్రసంగించారు. ఎన్నికల పోరులో బీజేపీ, బీజేడీ పైకి పోరాడుతున్నట్లు కనిపిస్తున్నా.. లోపల కలిసే ఉన్నాయని ఆరోపించారు. మోదీ శత కోటీశ్వరుల కోసం పని చేస్తుంటే.. ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కొందరి కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపిన బీఆర్‌ఎస్‌ను తాము అధికారంలో నుంచి దించేశామని చెప్పారు. ఒడిసాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి.

Updated Date - Apr 29 , 2024 | 04:52 AM