రూ.2.07 కోట్ల గోవా మద్యం పట్టివేత
ABN , Publish Date - May 12 , 2024 | 06:08 AM
ఏపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున గోవా మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) తరలించేందుకు చేస్తున్న యత్నాలకు పాలమూరు పోలీసులు చెక్‌పెట్టారు. గోవా నుంచి రాజమండ్రికి

ఏపీ ఎన్నికల్లో పంపిణీకి తరలిస్తున్న వైనం
తెలంగాణ బాలానగర్‌లో పట్టివేత
మహబూబ్‌నగర్/బాలానగర్, మే 11: ఏపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున గోవా మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) తరలించేందుకు చేస్తున్న యత్నాలకు పాలమూరు పోలీసులు చెక్‌పెట్టారు. గోవా నుంచి రాజమండ్రికి సినీఫక్కీలో పలుచెక్‌పో్‌స్టలు, పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ తరలిస్తున్న 2000 మద్యం కాటన్లు ఉన్న లారీని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. గోవాలో జాకబ్ అనే వ్యక్తి లారీలో రూ.2.07 కోట్ల విలువ చేసే 2000 కాటన్లలో 17280 లీటర్ల క్వార్టర్ సీసాల మద్యం రాజమండ్రికి తరలించేందుకు లారీలో లోడ్ చేసి పంపించారు. ముందస్తు సమాచారం రావడంతో శుక్రవారం అర్ధరాత్రి బాలానగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా ఎన్ ఫోర్స్‌మెంట్ ఎక్పైజ్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో లారీ పట్టుకున్నారు. పైన ఎరువుల బస్తాలు, కింద మద్యం కాటన్లు ఉండడంతో మద్యం నిల్వలను సీజ్ చేసి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.