Share News

డెలివరీ బాయ్‌ బ్యాగ్‌లో రూ.15 లక్షలు స్వాధీనం

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:39 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ నగదు రవాణాపై ఓ వైపు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు మరో వైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే గుట్టుగా తరలిస్తున్న రూ.76లక్షల

డెలివరీ బాయ్‌ బ్యాగ్‌లో రూ.15 లక్షలు స్వాధీనం

నగరంలో వాహనాల తనిఖీలు ముమ్మరం

శుక్రవారం రూ. 76లక్షలు పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ నగదు రవాణాపై ఓ వైపు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు మరో వైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే గుట్టుగా తరలిస్తున్న రూ.76లక్షల నగదును పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా గుబాల నాగార్జున అనే జొమాటో డెలివరీబాయ్‌ బ్యాగ్‌లో బైక్‌పై తరలిస్తున్న రూ.14.97లక్షలను సౌత్‌వె్‌స్ట టాస్క్‌ఫోర్స్‌, ఆసి్‌ఫనగర్‌ పోలీసులు సంయుక్తంగా మల్లెపల్లి సర్కిల్‌ వద్ద పట్టుకున్నారు. మంగళ్‌హాట్‌లోని ఓ ప్లైవుడ్‌ దుకాణం యజమాని ఆదేశాల మేరకు నగదు తీసుకెళ్తున్నానని డెలివరీ బాయ్‌ పోలీసులకు చెప్పాడు. అబిడ్స్‌ పరిధిలో హవాలా రూపంలో తరలిస్తున్న రూ.40లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రాజేష్‌, ముత్యాలు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తమ యజమాని విల్సన్‌ బాబు ఆదేశాల మేరకు డబ్బును తరలిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. కాగా, సికింద్రాబాద్‌లోని సీటీసీలో స్ర్కాప్‌ వ్యాపారం చేస్తున్న నూర్‌ మహ్మద్‌, మాలిక్‌ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఎలాంటి పత్రాలు లేకుండా రూ.21లక్షలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 03:40 AM