Share News

పాలన, అభివృద్ధిలో కార్పొరేట్‌ చట్టాల పాత్ర

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:46 PM

పాలనలో, అభివృద్ధిలో కార్పొరేట్‌ చట్టాల పాత్ర ఉందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎ్‌సఐ) అధ్యక్షుడు మనీ్‌షగుప్తా అన్నారు.

పాలన, అభివృద్ధిలో కార్పొరేట్‌ చట్టాల పాత్ర
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న ఐసీఎ్‌సఐ అధ్యక్షుడు మనీ్‌షగుప్తా

ఐసీఎస్‌ఐ అధ్యక్షుడు మనీష్‌గుప్తా

శామీర్‌పేట, జనవరి7: పాలనలో, అభివృద్ధిలో కార్పొరేట్‌ చట్టాల పాత్ర ఉందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎ్‌సఐ) అధ్యక్షుడు మనీ్‌షగుప్తా అన్నారు. శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయవిశ్వవిద్యాలయంలోని నిర్వహించిన మూడు రోజుల పాటు ‘కార్పొరేట్‌ చట్టాలు-భద్రత’పై జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ చట్టం, పాలన రంగంలోని తాజాపోకడలను పురోగతులను చర్చించడానికి ఇదొక మంచి వేదిక అని తెలిపారు .సహచరులతో ఆలోచనలను పంచుకొని వాటికి తగువిధంగా విశ్లేషించడానికి దోహదపడిందని చెప్పారు. వాటాదారుల ప్రయోజనం కోసం ప్రస్తుత చట్టాల్లో అవసరమైన మార్పులను తీసుకురావడమే ఈ సమావేశ ముఖ్య లక్ష్యమని తెలిపారు. తమ మొదటి ఏడీఆర్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో మార్చి 30లోగా ప్రారంభించి దేశంలో న్యాయపరమైన పర్యావరణ వ్యవస్థకు మద్దతున్వినున్నట్లు తెలిపారు. నల్సార్‌ వైస్‌చాన్స్‌లర్‌, ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు నల్సార్‌ న్యాయవిశ్వవిద్యాలయం సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు సిద్ధమైనట్లు తెలిపారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నల్సార్‌ యూనివర్సిటీ కార్యకలాపాల పట్ల మంచి ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. ఈసదస్సులో 168 కంపెనీ సెక్రటరీలు, న్యాయనిపుణులు, న్యాయవాదులు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో అత్యుత్తమంగా ముందంజలో ఉన్న పరిశ్రమ నాయకులు, కార్పొరేట్‌ నిపుణులు విధాన రూపకర్తలు, పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఎన్‌ఐ వైస్‌ ప్రెసిడెంట్‌ సీఎన్‌బీ నర్సింహన్‌, కాన్ఫరెన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:46 PM