Share News

ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాదం కేసు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:37 AM

ప్రజాభవన్‌ వద్ద బారీకేడ్లను కారుతో ఢీకొట్టిన కేసులో పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు అరెస్టయ్యారు. ఈ కేసులో నిందితుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహెల్‌ను తప్పించే ప్రయత్నం చేసిన దుర్గారావును హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అప్పట్లోనే సస్పెండ్‌ చేసిన విషయం

ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాదం కేసు..

హైదరాబాద్‌ సిటీ/ గుంతకల్లు, ఫిబ్రవరి 5: ప్రజాభవన్‌ వద్ద బారీకేడ్లను కారుతో ఢీకొట్టిన కేసులో పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు అరెస్టయ్యారు. ఈ కేసులో నిందితుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహెల్‌ను తప్పించే ప్రయత్నం చేసిన దుర్గారావును హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అప్పట్లోనే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే..! ఈ కేసులో ఇటీవలే బోధన్‌ మాజీ ఇన్‌స్పెక్టర్‌ అరెస్టవ్వగా.. దుర్గారావు మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుర్గారావు అజ్ఞాతంలో ఉంటూనే.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దుర్గారావు జాడను గుర్తించిన దర్యాప్తు అధికారులు.. సోమవారం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో అతణ్ని అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం దుర్గారావును హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 06 , 2024 | 04:38 AM