Share News

15న విశాఖకు రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:38 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల

15న విశాఖకు రేవంత్‌రెడ్డి

కూర్మన్నపాలెం/ఉక్కునగరం (విశాఖపట్నం), మార్చి 11: విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన కూర్మన్నపాలెం విచ్చేస్తున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జే.అయోధ్యరామ్‌ తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో సోమవారం పాల్గొన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమకు మద్దతు పలికేందుకు పక్క రాష్ట్ర సీఎం రావడం శుభపరిణామమన్నారు. కాగా, ఉక్కు టౌన్‌షి్‌పలోని తృష్ణా మైదానంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, పలువురు కేంద్ర మాజీ మంత్రులు పాల్గొంటారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 03:38 AM