Share News

గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించండి

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:48 AM

ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకుగాను గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) కోరింది. ట్రెసా

గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించండి

వీఆర్వోలను మళ్లీ నియమించండి : ట్రెసా

హైదరాబాద్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకుగాను గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) కోరింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలోని సంఘం ప్రతినిధులు సోమవారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని కలిసి పలు సమస్యలను ప్రస్తావించారు. మళ్లీ వీఆర్వోలను నియమించాలని, ఇతర శాఖల్లోకి పంపిన వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌ కుమార్‌, పూర్వ వీఆర్వోల జేఏసీ ఛైర్మన్‌ గోల్కొండ సతీష్‌, సెక్రటరీ జనరల్‌ హరలే సుధాకర్‌ రావు, కో చైర్మన్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 09:44 AM