Share News

రిటైర్డు జడ్జి జస్టిస్‌ రామలింగేశ్వరరావు మృతి

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:47 AM

ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఏ రామలింగేశ్వరరావు జర్మనీలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తన కుమార్తె వద్దకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన పార్థివదేహాన్ని రెండుమూడు రోజుల్లో జర్మనీ

 రిటైర్డు జడ్జి జస్టిస్‌ రామలింగేశ్వరరావు మృతి

ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఏ రామలింగేశ్వరరావు జర్మనీలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తన కుమార్తె వద్దకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన పార్థివదేహాన్ని రెండుమూడు రోజుల్లో జర్మనీ నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన 1956లో జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి డిగ్రీ, ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, తెలుగు వర్సిటీ నుంచి ఆస్ర్టాలజీలో ఎంఏ డిగ్రీలు పొందారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రాలజికల్‌ సైన్స్‌ ద్వారా జోతిష విశారదగా గుర్తింపు పొందారు. 1982లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయికీలక కేసుల్లో వాదనలు వినిపించడంతోపాటు టీటీడీ, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వంటి సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా వ్యవహరించి, ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 04:26 AM