Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Kumaram Bheem Asifabad- పల్స్‌పోలియోకు స్పందన

ABN , Publish Date - Mar 03 , 2024 | 10:41 PM

జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఇందుకుగాను వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వే శారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టారు.

Kumaram Bheem Asifabad-     పల్స్‌పోలియోకు స్పందన
జైనూర్‌లో పల్స్‌ పోలియోను ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఇందుకుగాను వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వే శారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి 3: ఎల్లారం గ్రామ పంచాయతీలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ ఆదివారం పల్స్‌ పోలియోను ప్రారంభించారు. ఐదు ఏళ్ల లోపు పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. వీరితో పాటు ఎల్లారం ఎంపీటీసీ నిర్మల, మాజీ సర్పంచ్‌ సీతారాం, మాజీ ఉప సర్పంచ్‌ చంద్రశేఖర్‌, మెడికల్‌ ఆపీసర్‌ వినోద్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉత్తం, సూపర్‌వైజర్‌ గోవర్ధన్‌, అంగన్‌వాడీ టీచర్‌ వెంకటమ్మ, ఆశా కార్యకర్త భారతి, గ్రామ అధ్యక్షుడు నానయ్య తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు తెలిపారు. ఆదివారం స్థానికంగా పోలియో చుక్కల కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కెరమెరి: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో విజయవంతం అయింది. మండలంలో 0-5 పిల్లలు 4,418 మందికి గాను 3,979 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఫార్మసిస్ట్‌ ఖలీల్‌ తెలిపారు. కాగా కెరమెరి బస్టాండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఎంపీపీ మోతిరాం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 96 కేంద్రాలలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 178 మంది సిబ్బందిని వినియోగించారు. కార్యక్రమంలో ఎంపీఓ అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఎంపీపీ విమలాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ, ఆశా, వైద్య సిబ్బంది సందర్శించి ఐదేళ్ల లోపు పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి వినయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండల వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంల్లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ(స్థానిక సంస్థలు) పిల్లలకు పల్స్‌పోలియో చుక్కల మందు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ తూకారాం, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, మండల వైద్యాధికారి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలో ఆదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదేవిధంగా పీహెచీసీలో సహకార చైర్మేన్‌ కొడప హన్నుపటేల్‌, గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్‌ మేస్రాం పార్వతీబాయి, ఎంపీడీవో ప్రభుదయ, తహసీల్దార్‌ తిరుపతి, జంగాంలో వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, లేండిజాలాలో ఎంపీపీ కుంర తిరుమల, బస్టాండ్‌ ఆవరణంలో కేంద్రంలో ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌, వైద్యాధికారి జితెందర్‌ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

లింగాపూర్‌: మండలంలో పల్స్‌పోలియె కార్యాక్రమం సజావుగా సాగిందని లింగాపూర్‌ పీహెచ్‌ డాక్టర్‌ ఆజీమ్‌ అన్నారు. మండలం మెత్తంలో 29 పోలియె క్ర్దేలను ఏర్పటు చేశామని చెప్పారు. మెత్తం 1,490 మంది ఐదేళ్లలోపు పిల్లులు ఉన్నారని చెప్పారు. ఇందులో ఆదివారం 1.390 మంది పిల్లలకు పోలియోచుక్కలు వేశామని అన్నారు. మిగిలిన వారికి సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి క వేస్తామని తెలిపారు.

సిర్పూర్‌(టి): ఐదేళ్ల లోపు గల చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్‌ నవత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంచేయడానికి సిర్పూర్‌(టి) మండలంలో 25 బూత్‌లను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్య కూడళ్లతో పాటు బస్టాఫ్‌, డౌనల్‌ ఏరియా, రైల్వే స్టేషన్‌ తదితర కేంద్రాల్లో తల్లితండ్రులు ప్రయాణిస్తూ చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ నవత, సూపర్‌వైజర్‌ పద్మావతి, సునీత, హెల్త్‌ అసిస్టెంట్‌ లాల్‌సింగ్‌, నాయకులు ఇఫ్పతుస్సెన్‌ తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. అయిదు సంవత్సరాల లోపు పిల్లలందరికి ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ సరిత కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలియ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు పాటు పడాలని అన్నారు. ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా, హెల్త్‌ సిబ్బంది పల్స్‌ పోలియోను విజయవంతం చేసేలా అవగాహన కల్పిస్తూ చుక్కల మందులు వేశారు.

చింతలమానేపల్లి: పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరు పాటు పడాలని ఎంపీపీ నానయ్య అన్నారు. మండల కేంద్రంలో అయిదేళ్లు లోపు చిన్నారులకు వైద్య సిబ్బందితో కలిసి పిల్లలకు చుక్కల మందు వేసి పల్స్‌ పోలియోను ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ఆశా, అంగన్‌వాడీ, హెల్త్‌ సిబ్బంది పల్స్‌ పోలియోను విజయవంతం చేసేలా అవగాహన కల్పిస్తూ చుక్కల మందులు వేశారు.

బెజ్జూరు: పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అయిదేళ్ల లోపు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు. మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగించి పోలియో చుక్కలు వేయని వారికి పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్‌ ఐజాక్‌, కమల, అయేషా తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండల వ్యాప్తంగా 92,.5 శాతం మంది 0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారిణి స్పందన తెలిపారు. మండలంలో 3,760 మందికి పిల్లలు ఉండగా 3411 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మరో రెండు రోజులు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.

కౌటాల: మండలంలో పల్స్‌ పోలియో విజయవంతం అయినట్లు డాక్టర్‌ నవత తెలిపారు. మండలంలో 2600 మంది చిన్నారులకు గాను 2452 మందికి పోలియో చుక్కలు వేయగా 94 శాతం పూర్తైనట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వంద శాతం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 10:41 PM