Share News

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా రాఘవేంద్ర జోషి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:24 AM

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు.

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా రాఘవేంద్ర జోషి బాధ్యతల స్వీకరణ

అల్వాల్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన హైదరాబాద్‌లోని ‘రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల(డీఆర్‌డీఎల్‌)’లో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఈవో అతుల్‌ దిన్‌కర్‌ పదవీకాలం ముగియడంతో రక్షణశాఖ ఈ నెల 26న జోషిని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా నియమించింది. ఆదివారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. జోషి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో బీటెక్‌ చేశారు. నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ చేశారు. క్షిపణి సాంకేతికతలో జోషికి 30ఏళ్లకు పైగా అనుభవం ఉంది. పృథ్వి, అగ్ని క్షిపణుల తయారీలో ఆయన పాత్ర ఉంది. ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణుల(ఎల్‌ఆర్‌సామ్‌) తయారీ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా జోషి ఆ క్షిపణుల తయారీలో అత్యంత కీలక పాత్ర పోషించారు.

Updated Date - Dec 02 , 2024 | 03:24 AM