Share News

5 పరీక్షల జనరల్‌ ర్యాంకులు విడుదల

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:04 AM

ఐదు పరీక్షలకు సంబంధించిన జనరల్‌ ర్యాంకులను టీఎ్‌సపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌

5 పరీక్షల జనరల్‌ ర్యాంకులు విడుదల

సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తుది జాబితా: టీఎ్‌సపీఎస్సీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఐదు పరీక్షలకు సంబంధించిన జనరల్‌ ర్యాంకులను టీఎ్‌సపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలకు సంబంధించిన జనరల్‌ ర్యాంకింగ్‌ను విడుదల చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 175 టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పోస్టులకు గత ఏడాది జూలై నెల 8 తేదీన పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్‌ కంట్రోల్‌- అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 2023 మే 19న పరీక్షలు జరిగాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ శాఖలో ఖాళీగా ఉన్న 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు జూన్‌ 17న పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌లో ఖాళీగా ఉన్న 71 లైబ్రేరియన్‌ పోస్టులకు గత ఏడాది మే నెల 17న పరీక్షలు జరిగాయి. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 2023 జూన్‌ 28న పరీక్షలు నిర్వహించారు. నోటిఫికేషన్‌లో పొందుపరిచిన నియమ నిబంధనలు, మెరిట్‌ ప్రాతిపదికన జీఆర్‌ఎల్‌ జాబితా రూపొందించినట్లు టీఎ్‌సపీఎస్సీ వెల్లడించింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది జాబితాను వెలువరిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అదేక్రమంలో వ్యవసాయ, సహకారశాఖ పరిధిలోని వ్యవసాయశాఖ అధికారి(ఏవో) పోస్టులకు సంబంధించిన జనరల్‌ ర్యాంకింగ్‌ను కూడా టీఎ్‌సపీఎస్సీ వెల్లడించింది.

Updated Date - Feb 17 , 2024 | 10:43 AM