బోర్డుకు నిధులు విడుదల చేయండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:52 AM
గోదావరి నది యాజమాన్య బోర్డుకు అందించాల్సిన నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ బోర్డు

తెలంగాణకు గోదావరి బోర్డు లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది యాజమాన్య బోర్డుకు అందించాల్సిన నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ బోర్డు కార్యదర్శి కోరారు. 2023-24లో రూ.16 కోట్ల బడ్జెట్‌కు గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఆమోదం లభించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.8 కోట్లను బోర్డుకు అందించాల్సి ఉందని, ఇప్పటిదాకా రూ.5.27 కోట్లు మాత్రమే చేరాయన్నారు. మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి లభ్యతపై చర్చించడానికి ఈ నెల 4న కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది.