Share News

మహిళలు స్వతహాగా ఎదిగినప్పుడే గుర్తింపు

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:09 PM

మహిళలు స్వతహాగా ఎదిగిననాడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ పోలీస్‌ అకాడమి ఆర్‌బీబీఆర్‌ఆర్‌, ఎఫ్‌ఏసీ వింగ్‌ డైరెక్టర్‌ అభిలాషభిశ్త్‌ అన్నారు.

మహిళలు స్వతహాగా ఎదిగినప్పుడే గుర్తింపు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అడిషనల్‌ డీజీపీ అభిలాషభిశ్త్‌

మేడ్చల్‌టౌన్‌, మార్చి 8: మహిళలు స్వతహాగా ఎదిగిననాడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ పోలీస్‌ అకాడమి ఆర్‌బీబీఆర్‌ఆర్‌, ఎఫ్‌ఏసీ వింగ్‌ డైరెక్టర్‌ అభిలాషభిశ్త్‌ అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని తెలంగాణ పోలీస్‌ ట్రేనింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలన్న పట్టుదల ఉండాలన్నారు. పట్టుదలతో ప్రారంభించిన పని మంచి గుర్తింపుతో పాటు లక్ష్యానికి చేరదీస్తుందన్నారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. సమాజానికి సేవలందించటానికి పోలీసు రంగాన్ని ఎంచుకున్న మహిళలు చిత్తశుద్ధ్దితో విధులు నిర్వహించి గుర్తింపు పొందాలన్నారు. తమ శాఖలో ఉన్న మహిళలకు తనవంతు సాకారం ఎల్లవేళల ఉంటుందన్నారు. ప్రస్తుతం ట్రెనింగ్‌ పూర్తి చేసుకున్న వారు ప్రజాసేవ చేయటానికి బయట ప్రపంచంలో అడుగుపెట్టనున్నారని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను వారు ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. అనంతరం ట్రేనింగ్‌ సెంటర్‌లో ఆమె మొక్కలు నాటారు.

Updated Date - Mar 08 , 2024 | 11:10 PM