Share News

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:27 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి.

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

మహబూబ్‌నగర్‌ రూరల్‌, జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి. బుధవారం మండలం లోని చౌదర్‌పల్లి కోడూరు గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్‌ సుందర్‌రాజ్‌లు ప్రారంభించగా, ఇప్పలపల్లి, గాజులపేట గ్రామాల్లో ఎంపీడీవో జ్యోతి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం, రైతుభరోసా పథకం, గృహజ్యోతిపథకం, ఇందిరమ్మఇళ్ల పథకం, చేయూత పథకానికి దరఖాస్తులను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల స్వీకరించాలన్నారు. అదే విధంగా కొత్త రేషన్‌కార్డుల కోసం, కొత్త పింఛన్ల కోసం, ఇతర ప్రభుత్వ పథకా ల లబ్ధిపొందేందుకు ప్రజల నుంచి సదస్సులలో వచ్చే ఇతర ఫిర్యాదులు, వినతి పత్రాలను కూడా అధికారులు స్వీకరించారు. ఎంపీవో నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ల సంఘం మండల అధ్యక్షుడు బి.శ్రీకాంత్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌లు వెంకటయ్య, చంద్రశే కర్‌, శంకరమ్మ అదికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీలను వినియోగించుకోండి

దేవరకద్ర, : కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచ్‌ జయమ్మ, రామాంజనే యులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్నరాజమూర్‌, బల్సుపల్లి, బస్వాపూర్‌, నార్లోనికుంట, గ్రామాల్లో ప్రజపాలన గ్రామ సభలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి ఆరు గ్యారెంటిలను స్వీకరించారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, డీటీ శివరాజు, ఆర్‌ఐ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:27 PM