Share News

బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:04 AM

సూర్యాపేట మునిసిపాలిటీలో చైర్‌పర్సన, వైస్‌చైర్మనపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది.

 బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు

సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన, వైస్‌చైర్మన్లపై అవిశ్వాసం

32 కౌన్సిలర్ల సంతకాలతో కలెక్టర్‌కు తీర్మాన నోటీసు

అందులో 15 మంది బీఆర్‌ఎస్‌ నేతలే

మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ

సూర్యాపేట మునిసిపాలిటీలో చైర్‌పర్సన, వైస్‌చైర్మనపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నుంచే తిరుగుబాటు మొదలైంది. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన 30 మంది కౌన్సిలర్లలో 15 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. మిగిలిన 15 మంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ సాగుతోంది. హైదరాబాద్‌ వేదికగా 32 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందజేశారు. ఈ తీర్మానం నెగ్గాలంటే 25 మంది కౌన్సిలర్ల మద్దతు కావాల్సి ఉంటుంది.

_ సూర్యాపేట టౌన

అవిశ్వాస నోటీసుతో తాజా రాజకీయ పరిణామాలు వేగంగా మారు తున్నాయి. బీఆర్‌ఎ్‌సకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస నోటీసులపై సంతకాలుచేశారు. ఇప్పటికే జిల్లాలో కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీల్లో అవిశ్వాసానికి తెరలేవగా తాజాగా సూర్యాపేటలోనూ అదేపరిస్థితి నెలకొంది. చైర్‌పర్సన, వైస్‌చైర్మన పదవులు ఆశించే వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. చైర్‌పర్సన పదవి జనరల్‌ మహిళకు రిజర్వుగా ఉంది. మొత్తం 48 వార్డులకు 47వ వార్డు కౌన్సిలర్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం 47 మంది ఉన్నారు. అయితే ప్రస్తుత మునిసిపల్‌ పాలకవర్గం 2020 జనవరి 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగా పాలకవర్గానికి మరో ఏడాది కాల పరిమితి ఉంది.

సొంత పార్టీ నేతల ప్రోత్సాహంతోనే

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన పెరుమాళ్ల అన్నపూర్ణ చైర్‌పర్సనగా, వైస్‌చైర్మన పుట్ట కిషోర్‌ ఉన్నారు. 2020 జనవరి 27వ తేదీన ప్రమాణస్వీకారం చేసిన ప్రస్తుత పాలకవర్గానికి మరో ఏడాది వరకు కాలపరిమితి ఉంది. వీరిని పదవి నుంచి తొలగించేందుకు బీఆర్‌ఎ్‌సకు చెందిన కౌన్సిలర్లే పావులు కదుపుతున్నారు. హైదరాబాద్‌ వేదికగా క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపారు. పలువురి చేరికతో బీఆర్‌ఎ్‌సకు ప్రస్తుతం 30మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో 15మంది కలెక్టర్‌కు అందజేసిన అవిశ్వాస నోటీసులో సంతకాలు చేశారు. మొన్నటివరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో అసమ్మతి నేతలు గళం వినిపించడానికి ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో మౌనంగా ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అయితే అవిశ్వాసానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వడం గమనార్హం. బీఆర్‌ఎ్‌సలోని అసమ్మతి నేత చైర్‌పర్సన పదవిని ఆశిస్తుండగా, వైస్‌చైర్మన పదవిని కాంగ్రె్‌సకు ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీలో బీఆర్‌ఎ్‌సకు 30 మంది, కాంగ్రెస్‌ పార్టీకి తొమ్మిది, బీజేపీకి నలుగురు, బీఎస్పీకి నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. 47వ వార్డుకు చెందిన కుమ్మరికుంట్ల దేవికకు కేంద్ర ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు ఉద్యోగం రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ పదవి ఖాళీ ఉంది. ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌ష రెడ్డికి ఇక్కడే ఓటు ఉండటంతో మొత్తం 48 ఓట్లు అయ్యాయి. అవిశ్వాసం నెగ్గాలంటే 25 ఓట్లు తప్పనిసరి కావాల్సి ఉంటుంది.

ఆశ్చర్యపరిచిన చైర్మన ఎంపిక

సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన పలువురు ఆ పదవిని ఆశించారు. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న జగదీ్‌షరెడ్డి చైర్‌పర్సన విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హేమాహేమీలను కాదని, ఎవరూ ఊహించని 9వ వార్డు నుంచి గెలిచిన పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్‌పర్సనగా ఎంపిక చేశారు. జనరల్‌ స్థానంలో ఎస్సీ మహిళకు ఇవ్వడంపై చర్చ జరిగింది. రిజర్వేషన లేనప్పుడు జనరల్‌ మహిళకు ఇస్తారని అంతా భావించారు. చైర్‌పర్సన పదవి కోసమే పలువురు పోటీ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. కేవలం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసమే కౌన్సిలర్లుగా పోటీ చేసి విజయం కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అయితే జగదీ్‌షరెడ్డి నిర్ణయంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నారు. ఎంపిక విషయానికి వచ్చేసరికి తమను పక్కన పెట్టడంపై మదనపడ్డారు. అన్నపూర్ణను చైర్‌పర్సనగా ప్రకటించటంపై చివరివరకు కౌన్సిలర్లకు కూడా తెలియకుండా చాకచక్యంగా జగదీ్‌షరెడ్డి వ్యవహరించారు. హైదరాబాద్‌ నుంచి బస్సులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నేరుగా మంత్రి క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కౌన్సిలర్లతో చర్చలు జరిపి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. అనంతరం వేగంగా పావులు కదిపారు. చైర్‌పర్సన్‌ పదవిని ఆశించిన అభ్యర్థులు, వారి భర్తలతో కూడా సమావేశం నిర్వహించి వారికి నచ్చజెప్పారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఆర్థికంగా ఉన్న వారు కాకుండా సామాన్య కుటుంబానికి చెందిన అన్నపూర్ణను ఎంపిక చేశారు. అందులోనూ జనరల్‌ మహిళ స్థానంలో ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని చివరి వరకు గోప్యంగానే ఉంచారు. సీల్డ్‌ కవర్‌లో పేరును ఉంచి ఎన్నికల అధికారికి అందజేశారు. ఇదిలా ఉండగా అన్నపూర్ణ 2014 మునిసిపల్‌ ఎన్నికల్లో 22వ వార్డు నుంచి పోటీ చేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. 2020లో 9వ వార్డు నుంచి పోటీ చేసి 274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనూహ్యంగా ఆమె పదవిని పొందారు.

అవిశ్వాసానికి 32మంది కౌన్సిలర్ల సంతకాలు

సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన, వైస్‌చైర్మన్లపై అవిశ్వాసానికి 32మంది కౌన్సిలర్లు మద్దతుగా సంతకాలు చేశారు. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి 15మంది ఉండగా కాంగ్రెస్‌ 9 మంది బీఎస్పీ నలుగురు, బీజేపీ నుంచి నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసానికి 48 వార్డులకు 50శాతం కన్నా ఎక్కువ మద్దతు అవసరం కాగా, 32మంది కౌన్సిలర్లు మద్దతుగా సంతకాలు చేశారు.

27న అవిశ్వాసంపై ఓటింగ్‌?

మునిసిపల్‌ చైర్‌పర్సన, వైస్‌చైర్మనపై 32మంది కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై ఈ నెల 27వ తేదీన ఓటింగ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు గురువారం పాలకమండలికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన అన్నపూర్ణపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైస్‌చైర్మన పుట్ట కిషోర్‌పై ఓటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మునిసిపల్‌ కౌన్సిలర్లకు నోటీసులు కూడా కలెక్టర్‌ జారీ చేసినట్లు తెలిసింది. కాగా సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజు 2020 జనవరి 27న చైర్‌పర్సన, వైస్‌చైర్మన్లు ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:04 AM