Share News

రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:42 PM

చెరుకూరి రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.

 రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శం
హాలియాలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, పలువురు నాయకులు

రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శం

ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి

హాలియా, జూన, 9: చెరుకూరి రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. హాలియా మునిసిపాలిటీలోని బస్టాండ్‌ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూ పం వద్ద ఆదివారం రామోజీరావు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు మృతి తెలుగు రాషా్ట్రల ప్రజలకు తీరని లోటని అన్నారు. జీవితకాలంలో వారందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాల ని ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గౌని రాజారమే్‌షయాదవ్‌, వివిధ పార్టీల నాయకులు, వడ్డే సతీ్‌షరెడ్డి, వర్ర వెం కట్‌రెడ్డి, సురభి రాంబాబు, ఆకారపు నరేష్‌, మంద తిరుపతయ్య, సైదులురావుగౌతమ్‌, రాంబాబు, పాత్రికేయులు వెంకట్‌రెడ్డి, దామోదర్‌, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌రె డ్డి, శ్రీనివాస్‌, అరుణ్‌కుమార్‌, విద్యాసాగర్‌, రాఘవాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:42 PM