నల్లగొండ మునిసిపల్ తాత్కాలిక చైర్మన్‌గా రమేష్‌గౌడ్
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:12 AM
నల్లగొండ మునిసిపల్ తాత్కాలిక చైర్మన్‌గా అబ్బగోని రమే్‌షగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
రామగిరి, జనవరి 10: నల్లగొండ మునిసిపల్ తాత్కాలిక చైర్మన్‌గా అబ్బగోని రమే్‌షగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై ఈ నెల 8న అవిశ్వాసం నెగ్గిన విషయం విదితమే. దీంతో వైస్ చైర్మన్‌గా ఉన్న అబ్బగోని రమేష్‌గౌడ్‌ను తాత్కాలిక చైర్మన్‌గా అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ ప్రకటించారు. దీంతో రమేష్‌గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఈఈ రాములు, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.