సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ
ABN , Publish Date - May 21 , 2024 | 11:58 PM
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అన్నారు.
నల్లగొండ టౌన్, మే 21: సాంకేతిక విప్లవానికి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 33వ వర్ధంతిని జిల్లాకేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేయడంతో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ శంకర్, నాయకులు జూలకంటి సైదిరెడ్డి, కన్నారావు, దుబ్బ మధు, గురిజ వెంకన్న, పిల్లి రమేష్‌యాదవ్, నల్లగొండ అశోక్, గోగుల గణేష్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, నాగేశ్వరరావు, కంచర్ల ఆనంద్‌రెడ్డి, జహంగీర్, బైరు ప్రసాద్, జావిద్, వనపర్తి రామ్, సర్వర్, అజ్జు పాల్గొన్నారు
మిర్యాలగూడ: రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్‌తో కలిసి రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. రాజీవ్ చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక సేవా కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నూకల వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, పొదిల శ్రీను, బాలకృష్ణ, ఎంఏ సలీం, అర్జున్, దుర్గారెడ్డి, గోవర్ధన్, రమేష్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మెరుగు రోషయ్య, ఉదయభాస్కర్, రమేష్, సత్యం, మధు, ఎల్లమ్మ, ఖాదర్, గోవిందరెడ్డి, నాగరాజు ఉన్నారు.
నార్కట్‌పల్లి: రాజీవ్‌గాంధీ వర్థంతిని నార్కట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల ఊశయ్య, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, జెరిపోతుల భరత్, ఐతరాజు యాదయ్య, స్రవం తి, ఎస్‌కే సమద్, అజీజ్, దోసపాటి వేణు, నర్సింహ పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాలలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ రెమిడాల లింగస్వామి, జిట్ట చంద్రకాంత్, సాగర్ల గోవర్ధన్, రెమిడాల మధు, గంగాపురం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్: పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో నకిరేకంటి యేసు పాదం, పన్నాల రాఘవరెడ్డి, కౌన్సిలర్ గాజుల సుకన్య, వెంకన్న, చౌగోని శ్రీను, ఉగ్గిడి శ్రీను పాల్గొన్నారు.
చిట్యాలరూరల్: గుండ్రాంపల్లిలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నమ్ముల విజయ్‌కుమార్, దుబ్బ పద్మకకుమారస్వామి, బండ కిష్టయ్య, బండ లింగ స్వామి, బండ అంజయ్య, దోర్నాల రామచంద్రం, గోపగోని నర్సింహ, చెరుకు రామలింగం, బుస్సు మధు, బడె రవి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: దేశంలో సుస్థిర పాలన, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని డీసీసీ ఉపాధ్యక్షుడు మేకల జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తమ్మడపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జగన్‌రెడ్డి, వెంకటయ్య, బండి హనుమంత్, బొమ్మనగోని రేవంత్‌యాదవ్, యాదయ్య ఉన్నారు. మర్రిగూడలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాందాసు శ్రీనివాస్, మేతరి యాదయ్య, రమావత్ శ్రీనివాస్, సిరిపంగ శ్రీనివాస్, శ్రీను, మహేష్ పాల్గొన్నారు.
ఫ ‘మిర్యాల’లో మరోమారు మనస్పర్థలు
మిర్యాలగూడ టౌన్: రాజీవ్ విగ్రహం సాక్షిగా.. కాంగ్రెస్ వర్గాల్లో మరోమారు మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కార్యక్రమం ప్రొటోకాల్ ప్రకారం జరగలేదని ఓ వర్గం మరో వర్గంపై రుసరుపలాడినట్లు పట్టణంలో చర్చ జరిగింది. మునిసిపల్ చైర్మన్ తిరుగనరు భార్గవ్ తన అనుచరులతో కలిసి రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ముందుగా వెళ్లి నివాళులర్పించడం ఏమిటని మొదటి వర్గానికి చెందిన కొందరు అభ్యంతరం తెలిసినట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కేతావత్ శంకర్‌నాయక్ స్థానిక నాయకులతో కలిసి రాజీవ్ విగ్రహం వద్దకు వచ్చారు. అయితే అంతకుముందు రెండో వర్గం వేసిన పూలదండలు తొలగించాలని, రాజీవ్ విగ్రహా నికి పాలా భిషేకం చేసిన తర్వాత పూలమాలలు వేయాలని కొందరు పట్టుబట్టగా, ఆ తంతు పూర్తిచేసిన తర్వాతే ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు స్థానికులు తెలిపారు.