Share News

రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ జమచేయాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:38 AM

రైతు భరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు.

 రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ జమచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ జమచేయాలి

తిరుమలగిరి(సాగర్‌), జూలై 7: రైతు భరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజనలో రుతుపవనాలు ఆలస్యం కారణంగా సరైన వర్షాలు లేక పంటల సాగు, పెట్టుబడికి రైతులు ఇబ్బందు లు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కూనరెడ్డి నాగిరెడ్డి, నాయకులు వేములకొండ పుల్లన్న, జటావత రవినాయక్‌, నల్లబెల్లి జగదీష్‌, కృష్ణయ్య, జటావత రవీందర్‌నాయక్‌, కొర్ర రాజునాయక్‌, లక్ష్మీకాంతరెడ్డి, జటావత కుమార్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:39 AM