Share News

వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మనగా రఘుమారెడ్డి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్‌ నూతన చైర్మనగా ఏనుగు రఘుమారెడ్డి గురువారం ఎన్నికయ్యారు.

 వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మనగా రఘుమారెడ్డి
రఘుమారెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మనగా రఘుమారెడ్డి

చిట్యాలరూరల్‌, జనవరి 11: చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్‌ నూతన చైర్మనగా ఏనుగు రఘుమారెడ్డి గురువారం ఎన్నికయ్యారు. వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మన రు ద్రారపు భిక్షంపై డైరెక ర్లు అవిశ్వాసం పెట్టగా ఈ నెల 10వ తీదీన డీసీవో కిరణ్‌కుమార్‌ నిర్వహించిన సమావేశంలో 11ఓట్లతో నెగ్గడంతో ఆయన పదవిని కోల్పోయారు. చైర్మనను ఎ న్నుకునేందుకు గురువారం పీఏసీఎస్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించా రు. చైర్మన స్థానానికి ఏనుగు రఘుమారెడ్డి నామినేషన దాఖలు చేయగా మరెవరు వేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా చైర్మనగా ఎన్నికయ్యారు. రికార్టుల్లో చైర్మనగా ఎన్నికైన రఘుమారెడ్డి, డైరెక్టర్లతో డీసీవో సంతకాలు చేయించారు. నూతన చైర్మన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎన్నిక పూర్తికాగానే కార్యాల యం నుంచి చైర్మన, వైస్‌చైర్మన, డైరెక్టర్లు బయటకు రాగానే కాంగ్రెస్‌ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, సర్పంచులు దేశబోయిన మల్లమ్మపాపయ్య, సామిడి మోహనరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, వీరేశం, లింగస్వామితో పాటు నాయకు లు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మనగా నూ తనంగా ఎన్నికైన ఏనుగు రఘుమారెడ్డి, వైస్‌చైర్మన, డైరెక్టర్లను ఎమ్మెల్యే వేముల వీరేశం సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM