Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్య : డీఈవో

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:28 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుందని డీఈవో డాక్టర్‌ కె. నారాయణరెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్య : డీఈవో
భువనగిరిలో మాట్లాడుతున్న డీఈవో నారాయణరెడ్డి

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 29: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుందని డీఈవో డాక్టర్‌ కె. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అనంతరం జడ్పీ హైస్కూల్‌ వార్షికో త్సవంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో చక్కటి ఫలితాలు సాధిస్తు న్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బలోపేతం అయ్యేవిధంగా తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సిహెచ్‌ రంగరాజన్‌, కే కృష్ణారెడ్డి, సామల వెంకటేష్‌, చిందం మల్లికార్జున్‌, ఫకీల్‌, కొండల్‌రెడ్డి, రాకల శ్రీనివాస్‌, విట్టల్‌ వెంకటేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంపీపీ చీర శ్రీశైలం అన్నారు. మండలంలో వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో మాట్లాడారు. విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్య, ఎంపీటీసీ మౌనిక, మాజీ సర్పంచ్‌ కానుగు కవితాబాలరాజ్‌గౌడ్‌, టీడీపీ జిల్లా నాయకుడు రేగు బాలనర్సయ్య, ప్రధానోపాధ్యాయడు ముత్తయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:28 AM