Share News

పుష్కరఘాట్‌లో వ్యర్థాలతో దుర్వాసన

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:25 AM

నాగార్జునసాగర్‌ పైలాన కాలనీలో 2016లో పుష్కరాల సమయంలో రూ. 4 కోట్ల వ్యయంతో వీఐపీ పు ష్కర ఘాట్‌ను నిర్మించారు.

 పుష్కరఘాట్‌లో వ్యర్థాలతో దుర్వాసన
సాగర్‌ పైలానకాలనీలో శివాలయం వద్ద వ్యర్థాలు

పుష్కరఘాట్‌లో వ్యర్థాలతో దుర్వాసన

శుభ్రం చేయని మునిసిపల్‌ సిబ్బంది

నాగార్జునసాగర్‌, ఏప్రి ల్‌19: నాగార్జునసాగర్‌ పైలాన కాలనీలో 2016లో పుష్కరాల సమయంలో రూ. 4 కోట్ల వ్యయంతో వీఐపీ పు ష్కర ఘాట్‌ను నిర్మించారు. పుష్కరాల అనంతరం ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలతో పాటు కర్మకండలు నిర్వహించుకోవడానికి ఈ పుష్కరఘాట్‌లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు వస్తుంటారు. కర్మకాండలు నిర్వహించుకనే సమయంలో కృష్ణానదిలో అస్థికలు ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అంతే కాకుండా తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. అలాగే శనిపూజలు పెట్టించుకొని ఆ దుస్తువులను ఇక్కడే వదిలేసి వెళ్తుంటారు. వ్యర్థాలు అన్ని పుష్కరఘాట్‌లో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొని వచ్చి దుర్వాసన వెలువడుతుంది. దీంతో పుణ్యస్నానాల కోసం ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునిసిపల్‌ అధికారులు స్పందించి పుష్కర ఘాట్ల వద్ద వ్యర్థాలను తొలగించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:25 AM