Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పల్స్‌ పోలియో విజయవంతం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:17 AM

జాతీయ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో విజయవంతంగా ముగిసింది.

పల్స్‌ పోలియో విజయవంతం
రామయ్యగూడ పీహెచ్‌సీలో పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేస్తున్న డీఎంహెచ్‌వో పాల్వన్‌ కుమార్‌

వికారాబాద్‌, మార్చి 3 : వికారాబాద్‌, మార్చి 3: జాతీయ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో విజయవంతంగా ముగిసింది. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 545 పోలియో బూత్‌లద్వారా 87,938 మంది పిల్లలకు పల్‌ ్స పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌కుమార్‌ తెలిపారు. వికారాబాద్‌పట్టణంలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో 93శాతం పల్స్‌ పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మరో రెండు రోజుల పాటు ఆరోగ్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి పిల్లందరికీ పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని, వారి బంగారు భవిష్యత్తుకు, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. వికారాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, రద్దీ ప్రదేశాలతో రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలను వైద్య సిబ్బంది అంగన్‌వాడీ టీచర్స్‌, ఆశాలు వేశారు. మేడ్చల్‌ జిల్లాలో 97 శాతం పల్స్‌పోలియో చుక్కలు వేయడం జరిగిందని డీఎంహెచ్‌వో రఘునాథస్వామి పేర్కొన్నారు. 1093 కేంద్రాలు, 39 మొబైల్‌ టీంల ద్వారా 109 రూట్ల ద్వారా 4,61,428 మందిచిన్నారులకు చుక్కల మందు వేశారు.

Updated Date - Mar 04 , 2024 | 12:17 AM