Share News

పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయుడు

ABN , Publish Date - May 19 , 2024 | 11:28 PM

పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయుడు
సుందరయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

- వర్ధంతి సమావేశంలో వక్తలు

పాలమూరు, మే 19 : పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బాలకిష్టయ్యగౌడ్‌ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన బాలలకు బహుమతులు అందజే యడానికి ముఖ్య అతిథులుగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెక్కెం జనార్దన్‌తో పాటు కొత్వాల్‌ పాల్గొన్నారు. పుచ్చలపల్లి 39వ వర్ధంతి సభ, బహుమతులు అందజేత కార్యక్రమానికి నల్లవెల్లి కురుమూర్తి అధ్యక్షత వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య దేశంలోనే ఆదర్శప్రాయమైన జీవితం గడిపారన్నారు. పుచ్చలపల్లి ధన్యజీవి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి స్వయంగా పోరాటంలో పాల్గొన్న మహానేత అన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెక్కెం జనార్దన్‌ మాట్లాడుతూ మొదటి ప్రతిపక్ష నాయ కుడిగా, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మొదటి కార్యదర్శిగా దేశానికి అనేక సేవలు చేశారన్నారు. దక్షిణ భారత దేశంలో పార్టీ నిర్మాణం, ఆంధ్రప్ర దేశ్‌ నదీ జలాల విషయంలో సమగ్ర భూ పంపిణీలో ప్రజారాజ్యం అనే నినా దంతో 17ఏళ్లపాటు ప్రజాప్రతినిధి అనేక సేవలు చేసిన మహాయోధుడన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రాములు, కిల్లె గోపాల్‌, ఆర్‌.రాంరెడ్డిలు మాట్లాడారు. బాలకిష్టయ్యగౌడ్‌ జిల్లాలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారన్నారు. బాలకిష్టయ్యగౌడ్‌ ట్రస్ట్‌ పేరుతో రెగ్యులర్‌గా పలు కార్యక్రమాలు నిర్వ హించాలని, బస్తీల్లో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్ర మాలు, బాలబాలికలకు క్రీడల్లో ప్రోత్సహించడం మహిళలకు కుట్టుమిషన్‌ ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడల్లో గెలు పొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బి.చంద్రకాంత్‌, వి.పద్మ, సుశీల, బాలమణి, లక్ష్మణ్‌, వెంకట్రాములు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:28 PM