ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : బీఎల్‌ఆర్
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:38 AM
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప నిచేస్తుందని ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, జనవరి 21: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప నిచేస్తుందని ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షనహాల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పాటైన నెల రోజుల వ్యవధిలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా బ స్సు ప్రయాణం కల్పించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వ రలోనే ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, మునిసిపల్ చైర్మన భార్గవ్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.