కేంద్ర తీరుపై 8న నిరసనలు: తమ్మినేని
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:19 AM
కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో రాష్ట్ర వాటాలను 41
కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో రాష్ట్ర వాటాలను 41 శాతానికి తగ్గించి రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాల వల్లే కేరళలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను విభాగాలను ప్రయోగించి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 8న నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.