Share News

నిరసన

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:21 PM

సీఎం రేవంత్‌రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొడంగల్‌, వికారాబాద్‌, మోమిన్‌పేట్‌, కోట్‌పల్లి, బంట్వారం, దౌల్తాబాద్‌లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దౌల్తాబాద్‌లో బాల్క సుమన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

నిరసన
కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న యువజన కాంగ్రెస్‌ నాయకులు

సీఎం రేవంత్‌రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొడంగల్‌, వికారాబాద్‌, మోమిన్‌పేట్‌, కోట్‌పల్లి, బంట్వారం, దౌల్తాబాద్‌లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దౌల్తాబాద్‌లో బాల్క సుమన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పులు చేత పట్టుకుని బాల్క సుమన్‌కు హెచ్చరిక చేశారు. బాల్క సుమన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా మేడ్చల్‌ జిల్లాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేశారు.

- వికారాబాద్‌/కీసర, ఫిబ్రవరి6

Updated Date - Feb 06 , 2024 | 10:21 PM