Share News

కస్టోడియన్‌ భూములను కాపాడండి

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:50 PM

మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలంలోని కస్టోడియన్‌ భూములను కబ్జాదారులచర నుంచి కాపాడాలని కాప్రాకు చెందిన మండల దేవేందర్‌గౌడ్‌ కోరారు.

కస్టోడియన్‌ భూములను కాపాడండి

మేడ్చల్‌, మార్చి 26 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి ) : మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలంలోని కస్టోడియన్‌ భూములను కబ్జాదారులచర నుంచి కాపాడాలని కాప్రాకు చెందిన మండల దేవేందర్‌గౌడ్‌ కోరారు. మంగళవారం కాప్రా కస్టోడియన్‌ భూముల కబ్జా విషయమై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాప్రాలోని సర్వే నంబరు 9, 11, 47, 140 నుంచి 143, 151, నుంచి, 676, 677లలో మెత్తం 90.08 ఎకరాల భూమి కస్టోడియన్‌ ల్యాండ్‌గా ప్రభుత్వ రికార్డులలో నమోదైందన్నారు. కాందిశీకులకు చెందిన ఈ భూమి ప్రస్తుతం కాప్రా తహసీల్దార్‌ పర్యవేక్షణలో ఉందని తెలిపారు. 2011లో సుప్రీం కోర్టు పలువురు కాందిశీకుల వారసులకు మెత్తం భూములను కేటాయించిందన్నారు. అట్టి భూములను కాందిశీకుల వారసులలో కొందరు విక్రయించగా నివాస కాలనీలు ఏర్పాడ్డాయని దేవేందర్‌గౌడ్‌ చెప్పారు. మిగతా 69.21 ఎకరాల కస్టోడియన్‌ భూములు ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నారు. మండల కుటుంబీకులకు ఈ భూముల పై ఎలాంటి హక్కులు లేనప్పటికి ఈ విషయాన్ని దాచి శరత్‌చంద్రారెడ్డి అనే వ్యక్తి మా నుంచి జీపీఏ చేయించుకున్నారని అన్నారు. జీపీఏ చేసిన మండల కుటుంబంలో తాను ఒక సభ్యుడినని దేవేందర్‌గౌడ్‌ తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి, నాగరాజుతో పాటు అతని అనుచరులు, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో కస్టోడియన్‌ భూములలో వెలసిన ఇళ్ల యజమానులను వేధింపులకు గురి చేస్తూ భూముల కబ్జాకు యత్నిసున్నాడని వాపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూన్నారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి కస్టోడియన్‌ భూముల కబ్జాకు యత్నిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోఆలని దేవేందర్‌గౌడ్‌ అధఙకారులను కోరారు.

Updated Date - Mar 26 , 2024 | 11:50 PM