Share News

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:49 PM

ప్రస్తుత ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పై అంత స్తు భవనంలో రెండు వార్డుల్లో అదనంగా మరో 60 పడకలను ఏర్పాటు చేసేందుకు ప్ర తిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఆసుప త్రి సూపరిండెంటెండ్‌ డాక్టర్‌ రంజిత్‌ కుమా ర్‌ను కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
జిల్లా ఆసుపత్రి ప్లాన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష - జిల్లా ఆస్పత్రుల పనుల పరిశీలన

నారాయణపేట వైద్యవిభాగం, ఫిబ్రవరి 2: ప్రస్తుత ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పై అంత స్తు భవనంలో రెండు వార్డుల్లో అదనంగా మరో 60 పడకలను ఏర్పాటు చేసేందుకు ప్ర తిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఆసుప త్రి సూపరిండెంటెండ్‌ డాక్టర్‌ రంజిత్‌ కుమా ర్‌ను కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. నారాయ ణపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని, ని ర్మాణంలో ఉన్న కొత్త జిల్లా ఆసుపత్రిని కలె క్టర్‌ శ్రీహర్ష శుక్రవారం పరిశీలించారు. పేట కు మంజూరైన మెడికల్‌ కళాశాలను ప్రారం భించేందుకు గాను తప్పని సరిగా 220 పడక లతో జిల్లా ఆసుపత్రిని నిర్వహించాల్సి ఉం టుందని, ఆసుపత్రిపై భాగంలో పెచ్చులూడి పడుతుండడంతో మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశిం చారు. పై అంతస్తు భవనంలో 60 పడకలతో కలిపి జిల్లా ఆసుపత్రిలో 120 పడకలు, పాత బస్టాండ్‌ వద్ద గల చిన్న పిల్లల వంద పడకల ఆసుపత్రిని కలిపి మొత్తం 220 పడ కలు అవుతాయని కలెక్టర్‌ తెలిపారు. మెడిక ల్‌ కళాశాలను ప్రారంభిస్తే కొత్తగా వచ్చే వైద్యనిపుణుల వసతి కోసం కలెక్టరేట్‌ సమీ పంలోని బృందావన్‌ కాలనీలో నిర్మిస్తున్న డ బుల్‌ బెడ్‌ రూం ప్లాట్లను కలెక్టర్‌ పరిశీలిం చారు. ఇక్కడ పది డబుల్‌ బెడ్‌రూం ప్లాట్లను అద్దెకు తీసుకునేందుకు సదరు భవన యజ మానితో మాట్లాడారు. అవసరమైన వసతి సౌకర్యాలను ఏర్పాటుచేసి నెల రోజుల్లో అప్ప గించాలని యజమాని బాలప్పను కలెక్టర్‌ కో రారు. అనంతరం అప్పక్‌పల్లి వద్ద నిర్మిస్తున్న జిల్లా ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్‌ పరిశీలిం చారు. ఆసుపత్రి భవనంలోని రెండో అం తస్తులో విశాలమైన హాల్స్‌ను మెడికల్‌ కళా శాల మొదటి సంవత్సరం తరగతుల నిర్వ హణ కోసం కలెక్టర్‌ పరిశీలించారు. ల్యాబ్‌ ఏర్పాటుకు అవసరమైన నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:49 PM