Share News

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : జగదీష్‌రెడ్డి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:26 AM

: ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : జగదీష్‌రెడ్డి
డిండి : రోడ్‌షోలో మాట్లాడుతున్న మాజీమంత్రి జగదీ్‌షరెడ్డి

డిండి, ఏప్రిల్‌ 29: ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా డిండి మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రైతుల ఇబ్బందులు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కల్యాణలక్ష్మి రూ.లక్ష 116తోపాటు తులం బంగారం, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలన్నారు. కేసీఆర్‌ని జైలులో వేయడం నీ అయ్యతరం కాదన్నారు. మోయలేని హమీలు ఇచ్చి అమలుచేయలేక రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడిందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో నల్లగొండ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులు రాజినేని వెంకటేశ్వరరావు, బిల్యానాయక్‌, వడ్త్య రమే్‌షనాయక్‌, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపీపీ మాధవరం సునితజనార్ధన్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, గిరమోని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చందంపేట: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. నల్లగొండ బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేసి తనను గెలిపిస్తే ఆరు గ్యారెంటీల అమలుపై పోరాటం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌, నాయకులు ఏడుపుల గోవిందు, యాసాని రాజవర్ధన్‌రెడ్డి, గోసుల శివ, బోయపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, మోహన్‌కృష్ణ, తిరుపతయ్య, ఆరేకంటి రాములు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:26 AM