ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:16 PM
నిరుద్యోగులకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారతీయ జన తా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి విమర్శించారు.

- కలెక్టరేట్ ముందు ఆందోళనలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి
మహబూబ్‌నగర్ (క్లాక్‌టవర్), జూలై 5 : నిరుద్యోగులకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారతీయ జన తా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి విమర్శించారు. ఉపాధ్యా య పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచి, మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ మీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ శుక్రవారం కలెక్టరేట్ ముం దు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరు ద్యోగ యువతకు తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను తీసుకరావాలని, గ్రూప్-1 ప్రిలి మినరీలో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికే షన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, 25 వేల పోస్టులతో మెఘా డీఎస్సీని నిర్వహించాలని, ఇప్పుడు నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను వాయిదా వేసి నూత నంగా తేదీలను ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలన అధికారికి వినతిప త్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు నవీన్‌రెడ్డి, శ్రీధర్, వెంకటేశ్, శివ, కుమార్, శివకృష్ణ, విష్ణు, చెన్న కేశవులు, నరేందర్, అంజి, నరేష్, రాహుల్ నాయక్, కన్న, మల్లేష్, నవీన్, మహేశ్, ఉదయకుమార్, అజయ్ యాదవ్, అరుణ్ యాదవ్, ప్రేమ్ కుమార్, రాఘవేందర్ గౌడ్, యశ్వంత్, హరీశ్, చెన్నయ్య, అభిషేక్ ఉన్నారు.