Share News

వృత్తి డ్రైవింగ్‌.. ప్రవృత్తి చైనస్నాచింగ్‌

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:05 AM

డ్రైవర్లుగా పని చేస్తున్న ఇద్దరు యు వకులు తమకు వస్తు న్న ఆదాయం సరిపోక ఆభర ణాల దొంగత నాన్ని ఎంచు కున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు శుక్రవారం వారిని అరెస్టు చేసి రూ.2.20లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు.

 వృత్తి డ్రైవింగ్‌.. ప్రవృత్తి చైనస్నాచింగ్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌రాజు

వృత్తి డ్రైవింగ్‌.. ప్రవృత్తి చైనస్నాచింగ్‌

మిర్యాలగూడ అర్బన, మార్చి 8: డ్రైవర్లుగా పని చేస్తున్న ఇద్దరు యు వకులు తమకు వస్తు న్న ఆదాయం సరిపోక ఆభర ణాల దొంగత నాన్ని ఎంచు కున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు శుక్రవారం వారిని అరెస్టు చేసి రూ.2.20లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దవూర మండలం పెద్దగూడెం కు చెందిన జింకల నాగరాజు, తిప్పర్తి మండలం గంగన్నపాలెంకు చెందిన ఈద సతీష్‌ వరుసకు బావబావమరుదులు అవుతారు. కారు డ్రైవర్లుగా పనిచేసే వీరిద్దరూ తేలికగా డబ్బు సంపాదించేందుకు బంగారు ఆభరణాల ను కాజేసేందుకు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 3న పెద్దగూడెంలో కూనరెడ్డి పిచ్చమ్మ వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా నిందితులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహి స్తుండగా, పెద్దవూర వైజంక్షన వద్ద వాహన తనిఖీల్లో యువకులు పట్టుబడ్డారు. నాగరాజు, సతీష్‌లను విచారించగా గతంలో చేసిన చైనస్నాచింగ్‌ ఘటనలను అంగీకరించినట్లు తెలిపారు. జనవరిలో నకిరేకల్‌ శివారులో పశువుల కాపరిగా వెళ్లిన వృద్ధురాలి వద్ద రూ.40 వేల విలువైన బంగారు గొలుసు, ఫిబ్రవరిలో నకిరేకల్‌ మండలం వెలమగూడెంలో మరో మహిళ మెడలోని రూ.35వేల విలువైన బంగారం గొలుసు, పెద్దగూడెంలో మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు అపహరించుకెళ్లినట్లుగా అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. వారినుంచి రూ.2.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. చైనస్నాచింగ్‌ కేసుల మిస్టరీని ఛేదించిన సాగర్‌ సీఐ బీసన్న, ఎస్‌ఐ సంపత, పోలీ స్‌సిబ్బంది ఆనందయోగి, కోటయ్య, కిషన, మట్టయ్య, రాజు, జావిద్‌, రవి, నాగరాజు, మధు, రాంబాబు, వెంకటరామిరెడ్డి డీఎస్పీ అభినందించారు.

Updated Date - Mar 09 , 2024 | 01:05 AM