సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:16 PM
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని సంక్షేమ హాస్టల్ యాత్ర జిల్లా అధ్యక్షుడు కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హన్వాడ/ మహమ్మదాబాద్, జూలై 28 : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని సంక్షేమ హాస్టల్ యాత్ర జిల్లా అధ్యక్షుడు కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హన్వాడలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్‌లో మరుగుదొడ్లు లేవని, స్నానాలకు ఇబ్బంది ఉందని అన్నారు. మెనూ అమలు చేయడంలేదని, తాగు నీరు కలుషితంగా ఉన్నాయని ఆరోపించారు. విద్యార్థులకు సరిపడే గదులు లేవని, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మాణిక్యంరాజు, నాయకుడు విష్ణు పాల్గొన్నారు.
ఫ మహమ్మదాబాద్‌లోని బాలు వసతి గృహం, బాలికల వసతి గృహం, నంచర్లలోని బాలుర వసతి గృహాన్ని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లెల మాణిక్యం రాజు, కురుమయ్య పరిశీలించారు. విద్యార్థులు వసతి గృహాలలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఆది విష్ణు పాల్గొన్నారు.