రోడ్డు విస్తరణలో సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:45 PM
బోయిన్‌పల్లి నుంచి కాళ్లకల్, మేడ్చల్ వరకు రూ.వేయి కోట్లతో జాతీయ రహదారి-44 విస్తరణలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు.
మేడ్చల్ కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బోయిన్‌పల్లి నుంచి కాళ్లకల్, మేడ్చల్ వరకు రూ.వేయి కోట్లతో జాతీయ రహదారి-44 విస్తరణలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఈ రోడ్డు విస్తరణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలోని ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉన్న పెట్రోల్ బంక్ అనుమతులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. తొందరగా ఇతర స్థలాల్లో అవార్డులు క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాల్సిందిగా, మ్యుటేషన్ చెల్లింపు జరిగిన స్థలాలు అప్పగించుటకు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివా్‌సరావు, ఆర్డీఓలు ఉపేందర్, శ్యాంప్రకాష్, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.