కాంగ్రెస్‌తోనే సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - May 12 , 2024 | 12:10 AM
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణలోని సమస్యలు పరిష్కారమవుతాయని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నా రు.

హుజూర్‌నగర్, మే 11: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణలోని సమస్యలు పరిష్కారమవుతాయని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నా రు. పట్టణంలోని మంత్రి ఉత్తమ్ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిశెట్టి రవికుమార్‌తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షం లో శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీగా రఘువీర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గెల్లి రవి, భాస్కర్, సతీష్, వీరయ్య, ఖలీల్‌బాబా, అశోక్, మహేష్, మీరా పాల్గొన్నారు. మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఐఎన్‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఈడ్పుగంటి సుబ్బారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
నేరేడుచర్ల: మండల పరిధిలోని రోళ్ళవారిగూడెం, బక్కయ్యగూడెం గ్రామాల్లోని బీఆర్‌ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకుడు కొణతం చిన్నవెంకటరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, కట్టా రామారావు, సోమయ్య, అనంతరెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, శ్రీనివాస్, రామనర్సు, కృష్నారావు, వెంకటయ్య, మీరా, వెంకన్న, రంజాన్ ఉన్నారు.
కోదాడ రూరల్: మండలంలోని బీక్యాతండాకు చెందిన 500 కుటుంబాలు శనివారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్య క్షుడు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, ఇర్ల సీతారాంరెడ్డి, అమరనాయిని వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిన్నా, చావా కిరణ్మయి, ఎండీ. అజీజ్‌పాషా, యల్లావుల రాములు, అట్లూరి మంజులహరిబాబు, షేక్ సైదా, వల్లబుదాసు కృష్ణ, యల్లమ్మ, గుండు వెంకటేశ్వర్లు, రమేష్, మోయిన్, జక్కుల వెంకయ్య, ఇట్టిమళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మోతె: మండల పరిధిలోని నేరేడువాయి, గోపతండా, తుమ్మగూడెం, నర్సింహాపురం గ్రామాల్లో ఎంపీపీ ముప్పాని ఆశ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, కీసర సంతోష్‌రెడ్డి, మైనంపాటి గుర్వారెడ్డి, నూకల మదుసూదన్‌రెడ్డి, సామ వెంకట్‌రెడ్డి, ముదిరెడ్డి మదుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
హుజూర్‌నగర్ రూరల్: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడు, బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని విఘ్నేశ్వరస్వామి టెంపుల్ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందిర సెంటర్‌లో రోడ్డుకార్నర్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్‌రెడ్డి, యరగాని నాగన్న, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జక్కుల వీరయ్య, కాలువ శ్రీనివాసరావు, పల్లె వెంకటరెడ్డి, నాగారపు పాండు, సాముల శివారెడ్డి, నర్సింగ్ వెంకటేశ్వర్లు, నారపరాజు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్: బీజేపీ, బీఆర్‌ఎస్ అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నాయని తెలంగాణ పర్యాటక అబివృద్ధి సంస్థ చైర్మన్, టీపీ సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్, 3వార్డుల్లో కుందూరు రఘువీర్‌రెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. పదేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అభివృద్ధిని విస్మరించాయన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కం డువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముదిరెడ్డి రమ ణారెడ్డి, వూర రామూర్తియాదవ్, షఫిఉల్లా, నిమ్మల వెంకన్న, జ్యోతి కర్ణాకర్, దారోజు జానకిరాములు, బాస్కర్‌నాయక్, సైదిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరుగ్యారెంటీలను అమలు చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కొప్పుల వేణారెడ్డి, శనగాని రాంబాబుగౌడ్ పాల్గొన్నారు.
మేళ్లచెర్వు: మండలకేంద్రంలోని యాదవ సంఘానికి చెందిన పలువురు నాయకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సమక్షంలో హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ముర్రిమేకల బసవయ్య, జనిగ శ్రీను, వీరబాబు, బత్తుల వెంకటస్వామి, కాకునూరి భాస్కర్‌రెడ్డి, గోవిందరెడ్డి, రామకృష్ణారెడ్డి, శంభిరెడ్డి, శంకర్‌రెడ్డి ఉన్నారు.
గరిడేపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బల పర్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలి పించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోరారు. మండలంలోని తాళ్లమల్కాపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెం డెం శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ పయిడిమర్రి రంగనాథ్, కటకం రమేష్, పోకల వెంకటేశ్వర్లు, షేక్ యాకుబ్, మండవ వెంకటేశ్వర్లు గౌడ్, షేక్ చాంద్‌మియా, కీసరి నాగయ్య, సందీప్, వెంకటరమణ, ఆంజనేయులు, సైదులు, యడ్ల అంజిరెడ్డి, కడియాల అప్పయ్య తదితరులు పాల్గొ న్నారు.
పెన్‌పహాడ్: మండలంలోని చీదెళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి, పీఏసీఎస్ నారాయణగూడెం మాజీ అధ్య క్షుడు సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పొట్లపహాడ్ మాజీ సర్పంచ్ నారా యణ సునీతశ్రీధర్‌రెడ్డి, చీదెళ్ల ఉపసర్పంచ్ గోపిల ఆధ్వర్యంలో 500మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభి వృద్ది కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు.