Share News

ముందు టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సిందే

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:32 AM

విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌-62 ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్తు అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్‌ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) వెల్లడించింది. ప్రభుత్వం

ముందు టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సిందే

లేదంటే ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు వీల్లేదు..

ఇందుకు విద్యుత్తు చట్టం ఒప్పుకోదు: ఈఆర్‌సీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈఆర్‌సీ వివరణ

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌-62 ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్తు అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్‌ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) వెల్లడించింది. ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయకపోతే రాయితీ లేదా ఉచిత విద్యుత్తు అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారమే కమిషన్‌ విధులు నిర్వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావులేదని పేర్కొంది. ‘‘ముందు రాయితీ మొత్తం ఇవ్వండి.. ఆ తర్వాత జీరో బిల్లులు జారీ చేయండి’’ అంటూ గృహజ్యోతి పథకం విషయంలో ఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలపై చైర్మన్‌ పేరెత్తకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్‌ తరపున కార్యదర్శి వివరణ ఇచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేనందువల్లే బిల్లులు జారీ చేయడం లేదని, బిల్లులు జారీ చేసే వినియోగదారులకు చట్టప్రకారం ప్రభుత్వం ముందస్తుగా సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టప్రకారం డిస్కమ్‌లు విధులు నిర్వర్తించేలా చూడటం కమిషన్‌ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాలకు లోబడే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిస్కమ్‌లను ఆదేశించినట్లు తెలిపారు.

Updated Date - Mar 19 , 2024 | 04:32 AM